త్వరలో అనుష్క, గోపీచంద్ ల వివాహం

ఇప్పటి వరకూ మూడు సినిమాల్లో నటించిన అనుష్క , గోపీచంద్ ల జంట, ఈ మూడు సినిమాలూ హిట్ అవడంతో హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాల్లో నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్ల వినిపించింది. ఈ వార్త సినీపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఈ విషయమై ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా వీరిద్దరికీ త్వరలో వివాహం జరుగనుందనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

వీరిద్దరి వివాహానికి వీరి ఇంట్లో పెద్దలు సమ్మతించారట. తొలుత గోపీచంద్ ఇంట్లో వీరిద్దరి విషయమై గొడవ జరిగినా ఆ తర్వాత వారు కూడా ఒప్పుకున్నారట. వచ్చే ఏడాది వీరిద్దరూ వధూవరులు కానున్నారని అనధికార సమాచారం. ఈ విషయమై వీరిద్దరూ నోరు మెదపడం లేదు. ఏదెలా వున్నా ఈ వార్త నిజమయితే గోపీచంద్, అనుష్కల 'హిట్ ఫెయిర్' కాస్త 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అవుతుందని చెప్పవచ్చు.

No comments: