అతనితో ప్రేమ తెరవరకే...త్రిష ఖండన

మేమిద్దరం ప్రేమికులనే వార్తను చాలామంది ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. శింబు నాకు మంచి స్నేహితుడు మాత్రమే. మా ప్రేమ కేవలం తెరవరకే అంటూ ఖండిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చింది తాజాగా త్రిష . ఆమె లేటెస్ట్ గా నటించిన 'విన్నైత్తాండి వరువాయా' ఈ శుక్రవారమే రిలీజవుతోంది. గౌతం మీనన్ దర్శకత్వంలో రెడీ అయిన ఆ చిత్రం గురించి చెపుతూ...అది మంచి రొమాంటిక్‌ ఫిల్మ్‌. ఇప్పటివరకు ప్రేమకథా చిత్రాలు చాలానే చేశాను. కానీ ఈ తరహా చిత్రం మాత్రం చెయ్యలేదు. కచ్చితంగా మీ అందరి హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందీ సినిమా.

ఇలాంటి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నేను మలయాళీ క్రిస్టియన్‌ అమ్మాయిగా నటించాను. నా పాత్ర పేరు జెస్సి. సింపుల్‌గా ఉంటాను. నా వస్త్రధారణ అందుకు తగ్గట్టుగా ఉంటుంది. సాదాసీదా కాటన్‌ చీరల్లో కనిపిస్తాను. హుందాగా ఉంటుంది నా పాత్ర. అలాగే ఈ చిత్రంలో శింబు, నేను బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యి చేశాం. మా ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలున్నాయి. మా మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్‌ అయ్యింది.అంత మాత్రానికి ఏవేవో ఊహించుకోవద్దు అని చెప్తోంది.

No comments: