బాధను తట్టుకోలేక ఏడ్చేసాను...మనోజ్

నేను బాధను తట్టుకోలేక ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ బిందాస్ లో చేసిన ఫైట్స్ గురించి చెప్పుకొచ్చారు హీరో మనోజ్. అయితే ఔట్‌పుట్ చూసుకున్నాక ఆ బాధంతా మరచిపోయాను అన్నారు. ఈ సినిమా కోసం అనేక ఫైట్స్‌ను డూప్స్, రోప్స్ లేకుండా రియల్‌గా చేశాం. ఈ ఫైట్స్‌కు కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రం కోసం చిత్రీకరించిన కొన్ని రిస్కీ షాట్స్‌ను ఇంతకుముందు జత చేయలేదు. త్వరలో వాటిని కూడా 'బిందాస్'లో జత చేయనున్నాం. ఈ షాట్స్ చూసి ప్రేక్షకులు మేం పడ్డ శ్రమను అభినందిస్తారు అని చెప్పారు.

ఇక 'బిందాస్'లో ఫైట్స్‌కు ప్రేక్షకుల నుంచి క్లాప్స్ రావడానికి నటుడు నరేష్ గారి అబ్బాయి నవీన్ ఎడిటింగ్ కూడా ఎంతో సహకరించింది. ఈ సందర్భంగా నవీన్‌కి నా కృతజ్ఞతలు. 'బిందాస్'లో ఫైట్స్ చూసి నాగార్జున, రాఘవేంద్రరావు, సుమంత్ గార్లు, సునీల్ అన్నయ్య ఎంతో అభినందించారు. తెలుగు తెరమీద ఇంతవరకూ ఎవరూ చూడని విధంగా ఫైట్స్ చూపించాలని అనిపించింది. అందుకే ఎంతో రిస్క్ చేసి ఈ ఫైట్స్ చిత్రీకరించాం అన్నారు.

No comments: