రామ్ చరణ్ ప్రవర్తనకు చిరు షాకయ్యారా

రామ్ చరణ్ తేజ, త్రిష కలిసి మందుకొడుతున్న ఫోటోలు నెట్ లో స్వైర్య విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం మిగతా వారికి వినోదంగా ఉన్నా చరణ్ తండ్రి చిరంజీవి కి మాత్రం ఆశ్చర్యంగానూ,షాక్ గాను ఉందని వినికిడి. ఈ ఫోటోలు చూసిన చిరంజీవి నిజమా కాదా అని ఎంక్వైరీ చేయించి కన్ఫర్మ్ చేసుకున్నారని చెప్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఈ విషయమై ఇంట్లో కూడా ఏ విధమైన కామెంట్ చేయాలేదని, చరణ్ ఫోన్ కాల్ కు కూల్ గా ఎప్పటిలాగే సమాధానమిచ్చారని అంతర్గత వర్గాలు చెప్తున్నారు. అయితే ఆయన నటుడు కాబట్టి ఆ విషయం విదేశాల్లో ఉన్న చరణ్ కి తెలియనీయకుండా అతని మనస్సు నొచ్చుకోనివ్వకుండా జాగ్రత్త పడ్డారని కొందరంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం విషయం తెలిసిందన్నట్లు బిహేవ్ చేస్తే తర్వాత తమ ఎదురుగానే అట్లా చేసే అవకాశం ఉందని అరవింద్ హెచ్చరించటంతో ఆ విషయం తనకి తెలియనట్లు ప్రవర్తించారని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి చూపు అంతా శ్రీకృష్ణ కమిటీపైనే ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తేజ...బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా కాంబినేషన్ లో ఆరెంజ్ అనే చిత్రం చేస్తున్నారు.

No comments: