ప్రిన్స్ మహేష్ బాబుతో బబ్లీ జెనీలియా

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోందని సినీ వర్గాల సమాచారం. సెక్సీబ్యూటి జెనీలియా మహేష్ బాబు సరసన నటించనున్నదని వినికిడి. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. వెంకటేష్, త్రిష నటించిన సక్సెస్ ఫుల్ చిత్రం ‘నమో వెంకటేశ’ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

కమర్షియల్ గా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వైట్లతో భారీ హంగులతో, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, అచంత గోపినాథ్ మరియు అచంత రామ్ నిర్మించనున్నారు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ కలగలిసిన కథతో ఓ సరికొత్త కోణంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో మహేష్ బాబు కనిపించనున్నారు. మరొక హీరోయిన్ గా ప్రముఖ నటి నటించనుంది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.

No comments: