Showing posts with label Rajini fear with Chandramukhi Aatma. Show all posts
Showing posts with label Rajini fear with Chandramukhi Aatma. Show all posts

Rajini fear with Chandramukhi Aatma

రజనీకాంత్‌ను ‘చంద్రముఖి’ ఆత్మ నీడలా వెంటాడుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కూడా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. అందులోనూ గత కొద్ది రోజులుగా రజనీకాంత్‌ గుళ్లు గోపురాలు తిరుగుతూ, హోమాలు, యాగాలు చేస్తున్నారు. అలాగే మృత్యుంజయ హోమాన్ని సైతం రీసెంట్ గా చేయించారు. అయితే దీనికంతటికీ కారణం రెండు నెలల క్రితం చనిపోయిన కన్నడ నటుడు విష్ణువర్ధన్‌ అని తెలుస్తోంది. రజనీకాంత్ కి మంచి మిత్రుడైన విష్ణు మరణించిన నాటి నుంచీ రజనీకాంత్‌ డీలా పడిపోయారు. ఆ దిగులు ఒకటైతే, విష్ణువర్ధన్‌ మరణం గురించి ఆయన చెవులకు సోకిన కథ మరింత గాభరా పెడుతోంది.

రజనీకాంత్ చంద్రముఖి చిత్రంకు ముందు ఆ చిత్రాన్ని విష్ణు వర్ధన్ కన్నడంలో ఆప్తమిత్ర పేరుతో చేసారు. అందులో విష్ణు వర్ధన్ తో పాటు లీడ్ రోల్ లో సౌందర్య చేసారు. 2004లో ఈ చిత్రం విడుదలకు ఒక నెల ముందు సౌందర్య చనిపోయారు. ఇటీవలే విష్ణు వర్దన్ చనిపోయారు. కన్నడ సినిమాలోని నాగవల్లి ఆత్మ ఈ ఇద్దరినీ మింగేసిందంటూ ప్రచారం మెదలైంది. విష్ణు వర్దన్ పాత్రను రజనీ పోషించటంతో ఆ భయం మరింత పెరిగిందంటున్నారు. ఇక పి.వాసు ఆప్తమిత్రకు సీక్వెల్ ఆప్తరక్షక ను తమిళంలో రీమేక్ చేసే ప్రపోజల్ తో ఉన్నారు. ఆప్త రక్షక ఈ శుక్రవారమే ధియోటర్లో దిగనుంది. విష్ణు వర్ధన్ మరణానికి ఒక నెల ముందే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. దాంతో రజనీకాంత్ ఇలా పూజలు పురస్కారాలు చేస్తున్నారని చెప్తున్నారు.