సంక్రాంతికి 'నమో వెంకటేశ'

వెంకటేష్‌, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'నమో వెంకటేశా చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ కుమార్‌లు నిర్మాతలు. డి.సురేష ్‌బాబు సమర్పకుడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

వెంకటేష్‌ మాట్లాడుతూ 'పర్వతనేని వెంకటరమణ అనే పాత్రలో నటిస్తున్నాను. ఇందులో వెంకటేశ్వర స్వామి భక్తుని పాత్ర పోషిస్తున్నాను. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో అన్ని అంశాలూ వ్ఞంటాయి అని అన్నారు. డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ' ఈ చిత్రంలోని రెండు పాటలను ఐస్‌ల్యాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. డిసెంబర్‌ రెండోవారంలో ఆడియోను విడుదల చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తాం అని చెప్పారు.

No comments: