రామ్ చరణ్ పెళ్ళి వార్తలకు అల్లు అర్జున్ అడ్డు?

జూ ఎన్టీఆర్ , లక్ష్మి ప్రణతిల పెళ్ళి కుదిరింది అన్న వార్తలు వినగానే టాలీవడ్ లో మరికొంతమంది హీరోల పెళ్ళి వార్తలు కూడా బయటికి వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్, తరుణ్, రాజా, గోపిచంద్ పెళ్ళికొడుకులు కాబోతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ప్రభాస్ పితృ వియోగంతో మరి కొన్ని రోజులు వాయిద వేసినట్టు తెలుస్తోంది. ఇక గోపిచంద్ అనుష్క ప్రేమ వ్యవహరం ఇంకా రెండు కుటుంబాల సంప్రదింపులు నడిస్తున్నది. రాజా ఆల్ రెడీ వైజాగ్ అమ్మాయిని తన లైఫ్ పాట్నర్ గా ఫిక్స్ అయ్యాడే, ఇక తరుణ్ మదర్ సెర్చింగ్.

ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్స్ గా వెలుగుతున్న అల్లు అర్జున్ , రామ్ చరణ్ తేజ పెళ్ళి వార్తలు అంతగా బయటికి రాలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరి పెళ్ళి గురించి మంతనాలు జరుగుతున్నాయని తెలుస్తోంది, చిరంజీవి అయితే రామ్ చరణ్ తేజ కోసం ఇప్పటికే పెళ్ళి కూతురిని అనంతపురంలోని ఓ పెద్ద బిజినేస్ మాన్ కుమార్తెను సెలెక్ట్ చేసి పెట్టాడని వినికిడి. అల్లు అరవింద్, అర్జున్ కి మ్యాచ్ సెట్ చేయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. అర్జున్ పెళ్ళి కుదిరిన వెంటనే రామ్ చరణ్ తేజ పెళ్ళివార్తలు బయటికి చెప్పాలని చిరంజీవి అనుకుంటున్నాడట. సో..చరణ్ పెళ్ళి వార్తలకు అడ్డు తగులుతున్నది అర్జున్ అన్నమాట.

No comments: