భారీ బడ్జెట్‌తో "లవకుశ" యానిమేషన్

25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో "ది కాణిపాకం క్రియేషన్స్"వారు రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ వారితో కలిసి నిర్మించిన 2డి యానిమేషన్ చిత్రం "లవకుశ- ద వారియర్ ట్విన్స్".

చిత్రం గురించి దర్శకుడు దవళ సత్యం మాట్లాడుతూ... "కథ ఇంతకుముందే సినిమాగా వచ్చింది. మళ్లీ లవకుశలా అనే అనుమానం రావచ్చు. రామాయణం మన పురాణం. మన చరిత్ర వీటిని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలనే మన పూర్వీకులు రకరకాల రూపాలలో రామాయణ గాధను చెప్పారు.

వాల్మీకి ఆశ్రమంలో లవకుశలు జన్మించి పెద్దయ్యాక శ్రీరాముడితో తలపడతారు. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు ఓ ప్రత్యేకత. నాలుగేళ్లుగా యానిమేషన్ టీమ్ ఎంతో శ్రమించి భారతీయులు గర్వపడే చిత్రంగా మలిచారు" అని చెప్పారు. ఆర్.టీవీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ... ఒకేసారి హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో వేసవిలో విడుదల చేస్తున్నామని చెప్పారు.

No comments: